బుధవారం, 8 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : బుధవారం, 24 జనవరి 2018 (08:42 IST)

బుధవారం రాశిఫలాలు : ఆదాయ వ్యయాలు...

మేషం : ఆదాయ వ్యాయాలు సరిసమానంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపార లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. పనులు చురుకుగా పూర్తి చేస్తారు. పెద్దల ఆరోగ్యం ఆ

మేషం : ఆదాయ వ్యాయాలు సరిసమానంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపార లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. పనులు చురుకుగా పూర్తి చేస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కళాకారులకు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. 
 
వృషభం : సంఘంలో గౌరవం పెరుగుతుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో పూరోభివృద్ది కానవస్తుంది. కొన్ని వివాదాలు నెలకొన్నా చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఉద్యోగులకు ఒక సమాచారం మరింత సంతోషం కలిగిస్తుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషులు మీవెన్నంటి నిలుస్తారు. 
 
మిథునం : రవాణా రంగాల వారికి ఇబ్బందులు తప్పపు. దూరపు బంధువులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. వస్త్ర, బంగారు, వెండి వ్యాపారస్తులకు లాభదాయకం. గృహంలో మార్పులు, చేర్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. మీ మనోభావాలకు మంచి స్పందన లభిస్తుంది. 
 
కర్కాటకం : ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. నిరుద్యోగులకు నిరుత్సాహం, చికాకులు తప్పవు. ధనం ఎంత వస్తున్నా ఏమాత్రం నిల్వ చేయలేక పోతారు. బ్యాంకు ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. దైవారాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపార వర్గా్ల వారి మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి. 
 
సింహం : రాజకీయ నేతలకు ప్రయాణాలలో ఆందోళనలు తప్పవు. రవాణా రంగంలోని వారు ఇబ్బందులను ఎదుర్కొంటారు. దంపతుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. ఉద్యోగస్తులు సమర్థవంతంగా పని చేసి అధికారులను మెప్పిస్తారు. విద్యార్థునులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. 
 
కన్య : ఖర్చులు మీ అదాయానికి తగినట్టుగానే ఉంటాయి. ఆత్మీయులు, కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ శ్రీమతి సలహా పాటించడం శ్రేయస్కరం. షేర్ల క్రయ, విక్రయాలు ఆశించినంత లాభసాటి కావు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. మీ అవసరాలుకు ధనం సర్దుబాటు కాగలదు. 
 
తుల : ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. కుటుంబీకుల మధ్య దూరపు బంధువుల ప్రస్తావన వస్తుంది. విద్యార్థినులు ప్రేమ వ్యవహారల్లో లౌక్యంగా ఉండాలి. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఒత్తిడి అధికమవుతాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళకువ, ఏకాగ్రత చాలా అవసరం. 
 
వృశ్చికం : విదేశాల నుంచి ఆప్తులరాక సంతోషం కలిగిస్తుంది. కోర్టు కేసు నుంచి బయటపడతారు. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. ఆశావహదృక్పథంతో కొత్త యత్నాలు సాగిస్తారు. వ్యాపారులకు కావలసిన అనుమతులు మంజూరవుతాయి. మిమ్ములను ఉద్రేకపరిచి ఆనందించాలని కొంతమంది యత్నిస్తారు. 
 
ధనస్సు : స్వార్థపూరిత ప్రయోజనాలు ఆశించి మీకు చేరువవ్వాలని భావిస్తున్న వారిని దూరంగా ఉంచండి. మీ శ్రీమతి అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇస్తారు. దైవ, సేవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అధికారుల ఇంటర్వ్యూల కోసం పడిగాపులు తప్పవు. విద్యార్థులు ధ్యేయం పట్ల మరింత శ్రద్ధవహిస్తారు. 
 
మకరం : సంతానం చదువుల నిమిత్తం భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తారు. మీపై వచ్చిన అభియోగాలు తొలగిపోగలవు. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరగలవు. లౌక్యంగా వ్యవహారాలను చక్కబెట్టుకుంటారు. బకాయిల వసూలులో సంయమనం పాటించండి. చేతి వృత్తుల వారికి మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. 
 
కుంభం : వ్యాపార, ఆర్థికాభివృద్ధికి చేయుకృషిలో ఆశాజనకమైన మార్పులు ఉంటాయి. అయినవారిరాక సంతోషం కలిగిస్తుంది. ఏదైనా అమ్మకానికై చేయు ఆలోచన వాయిదా వేయడం మంచింది. కోర్టు వ్యవహారాలలో ఫ్లీడర్లతో మెళకువ అవసరం. రాజకీయాలలో వారికి కార్యకర్తల వల్ల ఇబ్బందులు తప్పవు. 
 
మీనం : మీ శ్రీమతి సలహా ప్రకారం నడుచుకోవడం ఉత్తం. కొత్త స్కీములు అమలుతో వ్యాపారాల్లో రాణిస్తారు. ఉద్యోగస్తులు అధికారులతో మితంగా సంభాషించడం మంచింది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలో జయం పొందుతారు. పత్రికా సిబ్బందికి చిన్నచిన్న పొరపాట్లు దొర్లే ఆస్కారం ఉంది. ప్రయాణాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.