ప్రాణ వాయువు తీసుకొచ్చి కోవిడ్ బాధితుల ప్రాణాలు నిలబెట్టిన నాలుగో సింహం, శభాష్ పోలీస్
విజయవాడ ఒక ప్రవేటు ఆసుపత్రిలో నిండుకున్న ఆక్సిజన్ నిల్వలు....!!
వాయు వేగంగా వెళ్ళి ఆక్సిజన్ సాదించుకొచ్చిన విజయవాడ పోలీసులు....!!!
పోలీసుల సమయస్పుర్తి కి ప్రశంసల జల్లు కురిపిస్తున్న నెటిజన్లు.....!!!
కరోనా మహోగ్ర రూపం చూపిస్తున్న నేపథ్యం లో ప్రజల ప్రాణాలకు భరోసా లేకుండా పోయింది. ఆక్సిజన్ కొరత కారణంగా కరోనా బాధితులు చాలా చోట్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో విజయవాడ పోలీసులు సమయ స్ఫూర్తితో వ్యవహరించారు.
విజయవాడలోని ఒక ప్రవేటు ఆసుపత్రిలో ఆక్సిజన్ నిల్వలు నిండుకున్నాయి.. విషయం పోలీసులకు ఎలా తెలిసిందో కానీ నాలుగో సింహం ఆఘమేఘాల మీద వెళ్ళి ఆక్సిజన్ సిలిండర్లు సాధించుకొచ్చారు.
దీంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న కరోనా రోగులకు ప్రాణ వాయువు అందించి ఆదుకున్నారు. పోలీసులు చేసిన ఈ సాహసానికి నెటిజన్ల ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు... సోషల్ మీడియా లో ఇప్పుడు ఇదే అంశం వైరల్‌గా మారింది.