శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 9 ఆగస్టు 2021 (08:58 IST)

నేటి నుంచి శ్రీశైలంలో శ్రావణమాసోత్సవాలు

శ్రీశైలంలో నేటి నుంచి శ్రావణమాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రావణమాసం సందర్భంగా శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది.

నేడు శ్రావణమాసం తొలి సోమవారం కావడంతో భక్తులు స్వామి, అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్ వెలుపల వరకు బారులు తీరారు. స్వామి, అమ్మవార్ల ఉచిత దర్శనం కోసం 6 గంటలు, ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు.
 
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం తిరుమల శ్రీవారిని 20,575 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 2.50 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న స్వామివారికి 8,610 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.