ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 13 మార్చి 2018 (18:20 IST)

పార్లమెంట్ ఆవరణలో కుర్రాడు.. ప్రత్యేక హోదా కావాలని నినాదాలు.. ఎవరతడు?

తెలుగుదేశం పార్టీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ ఆవరణలో నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. టీడీపీ ఎంపీలతో తాజాగా ఓ యంగ్ టీడీపీ నేత పార్లమెంట్ ఆవరణలో తళుక్కుమన్నారు. అతను ఎవరో కాదు.. ప్రిన్స్ మహేష

తెలుగుదేశం పార్టీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ ఆవరణలో నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. టీడీపీ ఎంపీలతో తాజాగా ఓ యంగ్ టీడీపీ నేత పార్లమెంట్ ఆవరణలో తళుక్కుమన్నారు.

అతను ఎవరో కాదు.. ప్రిన్స్ మహేష్ బాబు మేనల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు సిద్దార్థ్. మంగళవారం ఉదయం పార్లమెంట్‌కు వచ్చిన సిద్ధార్థ్.. ప్లకార్డు పట్టుకుని పార్లమెంట్ ముందు నిలబడి నినాదాలు చేశాడు. 
 
అటుగా వెళ్లిన వారు ఎవరీ కుర్రాడు అంటూ ఆరా తీశాడు. మీడియా ఆ కుర్రాడిని ఫోకస్ చేసింది. విభజన హామీలు అమలు చేయాలని రాసున్న ప్లకార్డును ప్రదర్శించిన సిద్ధార్థ్.. రాష్ట్రానికి న్యాయం చేయాలని నినాదాలు చేశాడు. దీంతో సిద్ధార్థ్ రాజకీయాల్లోకి వస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే సిద్ధార్థ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారని.. త్వరలో సిద్ధార్థ్ హీరోగా ఓ సినిమా కూడా తెరకెక్కనుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది.