ఘనంగా సింగర్ సునీత వివాహం
టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత వివాహం మ్యాంగోమూవీస్ అధినేత రామ్ వీరపనేనితో నిన్న రాత్రి శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లి శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయంలో వైభవంగా జరిగింది.
కరోనా నేపథ్యంలో.. కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో, పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల మధ్యలో వీరి వివాహం జరిగింది. ప్రస్తుతం సునీత పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సునీత వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నందినీ రెడ్డి, హీరో నితిన్ దంపతులు కూడా వీరి పెళ్లికి వచ్చారు.