మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 6 సెప్టెంబరు 2024 (08:57 IST)

విజయవాడ డివిజన్‌లో అనేక రైళ్లు రద్దు .. ఎందుకో తెలుసా?

trains
విజయవాడ డివిజన్‌లో సాంకేతిక పనుల కారణంగా అనేక రైళ్లను రద్దు చేశారు. శుక్రవారం నుంచి ఈ నెల 9వతేదీ వరకు ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. అలాగే, దసరా, దీపావళి పండగల నేపథ్యంలో మాల్డాటౌన్‌ - సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలునంబరు 03429/03430 అక్టోబరు 8వ తేదీ నుంచి నవంబరు 28 వరకు ప్రతి మంగళ, గురువారాల్లో మాల్డాటౌన్‌- సికింద్రాబాద్‌ మధ్య రాకపోకలు సాగిస్తుంది. ఈ రైలు ఖరగ్‌పూర్, బాలాసోర్, భద్రక్, కటక్, భువనేశ్వర్, కుర్దారోడ్, శ్రీకాకుళం రోడ్, విజయనగరం, కొత్తవలస, పెందుర్తి, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నడికుడి, మిర్యాలగుడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతుంది.
 
కాగా, రద్దు చేసిన వాటిలో 07459 విజయవాడ - రాజమండ్రి, 07575 తెనాలి - విజయవాడ, 07500 విజయవాడ - గూడూరు, 17257 విజయవాడ - కాకినాడ పోర్ట్, 07868/07869 గుడివాడ - మచిలీపట్నం, 07885/07886 భీమవరం - నిడదవోలు, 07281 నరసాపురం - గుంటూరు, 07460 రాజమండ్రి - విజయవాడ, 07896 మచిలీపట్నం - విజయవాడ, 07769 విజయవాడ - మచిలీపట్నం, 07871/07872 మచిలీపట్నం - గుడివాడ, 07898/07899 మచిలీపట్నం - విజయవాడ, 07461 విజయవాడ - ఒంగోలు, 07576 ఒంగోలు - విజయవాడ, 07867 మచిలీపట్నం - విజయవాడ, 07877 విజయవాడ - భీమవరం, 07885/07886 భీమవరం - నిడదవోలు, 17263 భీమవరం - నరసాపురం, 07673/07674  నరసాపురం - నిడదవోలు, 07863 నరసాపురం - విజయవాడ, 07866 విజయవాడ - మచిలీపట్నం,  07770 మచిలీపట్నం - విజయవాడ, 07283 విజయవాడ - భీమవరం, 07772 భీమవరం - నిడదవోలు, 07882 నిడదవోలు - భీమవరం, 07865 భీమవరం - విజయవాడ, 07768 విజయవాడ - రాజమండ్రి, 07767 రాజమండ్రి - విజయవాడ, 17258 కాకినాడ పోర్ట్‌ - విజయవాడ (6వ తేదీ నుంచి 9 వరకు), 07977/07978 విజయవాడ - బిట్రగుంట(6వ నుంచి 9 వరకు), 07784/07785 గుంటూరు - రేపల్లె(6వ నుంచి 9 వరకు), 17269 విజయవాడ - నరసాపురం(7వ నుంచి 9 వరకు) రైళ్లు ఉన్నాయి.