శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 22 జనవరి 2019 (15:33 IST)

శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఛైర్మన్ వేధింపులు.. ఫినాయిల్ తాగిన క్లర్కు

శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఛైర్మన్ వేధింపులు తాళలోని ఆ కార్యాలయ క్లర్కు ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మంగళవారం కలకలం సృష్టించిన ఈ వివరాలను పరిశీలిస్తే, శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఛైర్మన్ కార్యాలయంలో క్యాంపు క్లర్క్‌గా సంతోష్ కుమార్ పని చేస్తున్నారు. ఈయన్ను జడ్పీ సీఈఓ నగేష్ గత రెండేళ్లుగా మానసికంగా వేధిస్తున్నాడు. పైగా పదోన్నతిలో సంతోష్‌కు అన్యాయం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. 
 
దీంతో సంతోష్ మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తన బాధను వెళ్లబోసుకుంటూనే ఉన్నట్టుండి ఫినాయిల్ సేవించాడు. ఈ హఠాత్పరిణామంతో బిత్తర పోయిన ఇతర సిబ్బంది ఆయన్ను అడ్డుకున్నారు. ఆ తర్వాత సంతోష్‌ను బలవంతంగా రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.