గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజ‌య‌వాడ‌ , మంగళవారం, 26 అక్టోబరు 2021 (17:00 IST)

విద్యార్థి దశ నుండే ఆయుధాలపై అవగాహన కావాలి

విద్యార్థి దశ నుండే ఆయుధాల గురించి అవగాహన కలిగి ఉండాలని అనంతపురం రేంజ్ డి.ఐ.జి కాంతి రాణా టాటా, జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి అభిప్రాయపడ్డారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని డి.ఐ.జి, ఎస్పీలు ప్రారంభించారు. పోలీసులు వినియోగించే ఆయుధాలు, పరికరాలు, సాధనాలను ప్రదర్శనలో ఉంచి ప్రజలకు అవగాహన చేశారు. ఏటా అమర పోలీసులను స్మరించుకుంటూ నిర్వహించే పోలీసు అమర వీరుల వారోత్సవాలులో భాగంగా ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. 
 
 
జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని  కోదండ రామాలయం కళ్యాణ మండపంలో పోలీసులు తమ దైనందిన విధుల్లో వినియోగించే వివిధ రకాల ఆయుధాలు, పరికరాలు, సాధనాలను ప్రదర్శనలో ఉంచారు. సుశిక్షుతులైన సిబ్బందిచే సందర్శనకు విచ్చేసిన ప్రజలకు ఆయుధాల గురించి అవగాహన క‌ల్పించారు.  ఏ సందర్భంలో ఎలాంటి ఆయుధాన్ని వినియోగిస్తారు, వాటి పనితీరు గురించి  విద్యార్థులకు అవగాహన కల్పించారు.

 
ఈ ప్రదర్శనలో .22 రైఫిల్, .410 మస్కెట్, 303 రైఫిల్, 762 ఎం.ఎం SLR, ఏ.కే 47, 5.56 ఎం.ఎం (ఇన్సాస్ ), 12 బోర్ పంప్ యాక్సన్ గన్, 9 ఎం.ఎం. కార్బైన్, 380 రివాల్వర్, 9 ఎం.ఎం ఫిస్టోల్ ఉంచారు. అలాగే, 9 ఎం.ఎం గ్లాక్, వి.ఎల్ ఫిస్టోల్, ప్రొజెక్టర్ ఫైరోటెక్, 12 బోర్ పంప్ యాక్సన్ గన్, ఎల్ .ఎం.జి, 51 ఎం.ఎం మోటారు, హెచ్ .ఇ 36 గ్రనేడ్ , యాంటీ రైట్ గన్స్ , గ్యాస్ గన్ , రోబోటెక్ ( బాడీ ప్రొటెక్టర్ ) ఉంచారు.  సేవాదళ్ డ్రస్, ఫైబర్ లాఠీ, బాడీ ప్రొటెక్టర్ , స్టోన్ గార్డు, హెల్మెట్ , కేన్ లాఠీ, బుల్లెట్ ప్రూప్ జాకెట్ హెవీ, మీడియం, లైట్,  డే,  నైట్ విజన్ బైనాక్యూలర్లు, జి.పి.ఎస్, మెగాఫోన్, లెటర్ బాంబు డిటెక్టర్, ప్యాకెట్ స్కానర్, డి.ఎస్ .ఎం.డి, HHMD, NLJD, నార్కో డిటెక్సన్ కిట్, పాలిరే యు.వి.లైట్, క్లూస్ టీం, డస్ట్ ఫుట్ ప్రింట్ లిఫ్టర్, LHMS, బాడీవోన్ కెమేరాలు, ఫిన్స్ ( ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ నెట్ వర్కింగ్ సిస్టం) , డ్రోన్ కెమేరాలు, డి.ఎఫ్ .ఐ.డి, బాంబు రింగ్, డాగ్ బృందాలను ప్రదర్శనలో ఉంచారు.

 
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేంద్రుడు, ఓఎస్డీ రామకృష్ణ ప్రసాద్ , ఏ.ఆర్ అదనపు ఎస్పీ హనుమంతు, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్ నాథ్ , సుధాకర్ రెడ్డి, శ్రీనివాసుల నాయుడు, తేజ్ పాల్ , రిజర్వ్ ఇన్స్పెక్టర్లు టైటస్ , శ్రీశైలరెడ్డి, నారాయణ, పలువురు ఆర్ ఎస్ ఐ లు, వివిధ పాఠశాలల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.