ఏపీకి సుష్మా స్వరాజ్, తెలంగాణకి సుమిత్రా మహాజన్... గవర్నర్లుగా అంటండీ...?
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్. ఏపీ విభజన జరిగినప్పటికీ రెండు రాష్ట్రాలకి ఆయననే గవర్నర్‌గా కొనసాగిస్తున్నారు. ఐతే ఎన్డీయే బంపర్ మెజారిటీతో గెలవడం, కేంద్రంలో మరోసారి మోదీ చక్రం తిప్పడం జరిగిపోయింది. దీనికితోడు కొత్తగా కేంద్ర హోంశాఖామంత్రిగా అమిత్ షా బాధ్యతు చేపట్టారు. ఇక అప్పట్నుంచి అమిత్ షా ప్రత్యేకించి తెలంగాణపై టార్గెట్ పెట్టినట్లు చెపుతున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ పంటికింది రాయిలా కొరుకుడు పడటం లేదనీ, అందువల్ల తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా సుమిత్రా మహాజన్‌ను నియమిస్తే ఎలా వుంటుందన్న కోణంలో ఆలోచన చేస్తున్నారు. అలాగే ఏపీలోనూ భాజపా తనదైన మార్కును కనబర్చాలనుకుంటోంది. ఈ క్రమంలో ఏపీ గవర్నర్‌గా సుష్మా స్వరాజ్ ను ఎంపిక చేస్తే ఎలా వుంటుందని అమిత్ షా ఆలోచన చేస్తున్నారట. మరి ఇందులో ఎంతవరకు నిజం వుందో చూడాలి మరి.