సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (14:37 IST)

మంత్రి సిదిరి అప్ప‌ల‌రాజుకు ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీదేవి స్వాగ‌తం

గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఏపీ మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుకు తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే  డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.
 
తాడికొండ నియోజకవర్గంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర  పశువైద్య  విశ్వవిద్యాలయం పశు పరిశోధనా స్థానం, లాం ఫారం కేంద్రాల‌ను ఈ సంద‌ర్బంగా మంత్రి అప్పలరాజు సంద‌ర్శించారు. లాం ఫారంలో మంత్రి అప్పలరాజుకు ఘనంగా స్వాగతం ప‌లికిన ఎమ్మెల్యే  డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి, స్థానిక వైద్య విద్యార్థులు, అధికారులు ఆయ‌న‌కు ఇక్క‌డి స‌మ‌స్య‌లు ఏక‌రువుపెట్టారు.

లాంఫారంలోని కాన్ఫరెన్స్ హాలులో రైతులతో, వైద్య విద్యార్థులతో పశుసంవర్ధక శాఖ మంత్రి ముఖాముఖి నిర్వహించారు. స‌మ‌స్య‌ల్ని త‌ర్వ‌లోనే ప‌రిష్క‌రిస్తామ‌ని చెప్పి, రైతులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు.