శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 9 జులై 2017 (10:29 IST)

కర్నూలులో టీడీపీ షాక్.. : వైకాపాలో చేరనున్న శిల్పా చక్రపాణి రెడ్డి?

కర్నూలు జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత శిల్పా మోహన్ రెడ్డి వైకాపాలో చేరారు. అలాగే, ఆయన సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డి కూడా టీడీపీ

కర్నూలు జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత శిల్పా మోహన్ రెడ్డి వైకాపాలో చేరారు. అలాగే, ఆయన సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డి కూడా టీడీపీని వీడి వైపాకా అధినేత జగన్ మోహన్ రెడ్డి చెంతకు చేరనున్నారు.
 
భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో నంద్యాల ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ పోటీ చేసేందుకు టీడీపీకి చెందిన శిల్పా బ్రదర్స్ పోటీపడ్డారు. అయితే, టిక్కెట్ కేటాయించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిరాకరించారు. దీంతో కినుక వహించిన శిల్పా మోహన్ రెడ్డి టీడీపీని వీడి వైకాపాలో చేరగా, ఆయన సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డి అదే బాటలో నడువనున్నారు. 
 
ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న శిల్పాచక్రపాణి త్వరలోనే వైకాపాలోకి జంప్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ సోదరులకు నంద్యాల నియోజకవర్గంలో మంచి పట్టుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక సోదరుడికి వ్యతిరేకంగా, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసేందుకు ఆయన సుముఖతతో లేరని తెలుస్తోంది. ఇదేవిషయాన్ని ముందే పసిగట్టిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం నంద్యాల ప్రచార బాధ్యతలను కూడా ఆయనకు అప్పగించలేదు. 
 
సోదరుడి గెలుపు కోసం ఆయన తనవంతు పాత్రను పోషిస్తున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమానికి సైతం ఆయనకు ఆహ్వానం అందలేదు. ఈ మొత్తం వ్యవహారం నంద్యాల నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ మారే విషయమై శిల్పా చక్రపాణిరెడ్డి నుంచి అధికారిక ప్రకటన వెలువడకున్నా, జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే మాత్రం ఆయన పార్టీని వీడటం ఖాయమని తేలిపోయింది.