బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 3 ఫిబ్రవరి 2018 (16:40 IST)

కాంగ్రెస్ తలుపులు మూసి చేస్తే.. బీజేపీ తలుపులు తెరిచే ముంచేసింది : టీడీపీ ఎమ్మెల్యే

పార్లమెంట్ తలుపులు మూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ రెండు ముక్కలు చేస్తే, ఇపుడు అధికారంలో ఉన్న బీజేపీ తలుపులు తెరిచే నిలువునా అన్యాయం చేసిందని టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి

పార్లమెంట్ తలుపులు మూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ రెండు ముక్కలు చేస్తే, ఇపుడు అధికారంలో ఉన్న బీజేపీ తలుపులు తెరిచే నిలువునా అన్యాయం చేసిందని టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. ఇటీవల విత్తమంత్రి జైట్లీ ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్‌లో ఏపీకి తీరని అన్యాయం చేసిన విషయం తెల్సిందే. దీనిపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు. 
 
తలుపులు మూసి విభజన బిల్లుకు ఆమోదం తెలిపిన కాంగ్రెస్ పార్టీకి ఏపీ ప్రజలు సమాధి కట్టారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. అలాగే, బీజేపీ కూడా ఇపుడు తలుపులు తెరిచి అన్యాయం చేస్తే ప్రజలు తగిన గుణపాఠం చెపుతారని హెచ్చరించారు.
 
ఇకపోతే, మరో ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీప్రభుత్వంపై తమ భ్రమలు పటాపంచలయ్యాయన్నారు. కేంద్ర బడ్జెట్‌పై ప్రతి సీమాంధ్రుడి గుండె రగలిపోతోందన్నారు. కేంద్రం ఫెడరల్ స్ఫూర్తికి తూట్లు పొడుస్తోందని, ఇంకా బీజేపీని పట్టుకుని వేలాడటం సరికాదన్నారు. తెగదెంపులపై పదిరోజుల్లో ఏదోఒకటి తేలిపోతుందని, ఓపిక నశిస్తే తెలుగువారు తిరగబడతారని బుచ్చయ్యచౌదరి హెచ్చరించారు.