మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 3 ఫిబ్రవరి 2018 (12:53 IST)

బీజేపీతో కటీఫా.. పవన్‌తో దోస్తీనా అనేది త్వరలో తేలిపోతుంది: టీజీ వెంకటేష్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ విమర్శలు గుప్పించారు. టీడీపీ ఎంపీలందరూ రాజీనామా చేయాలంటూ గతంలో పవన్ కల్యాణ్ పిలుపునిచ్చిన విషయంపై టీజీ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. పవన్ కల్యాణ్ చెబ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ విమర్శలు గుప్పించారు. టీడీపీ ఎంపీలందరూ రాజీనామా చేయాలంటూ గతంలో పవన్ కల్యాణ్ పిలుపునిచ్చిన విషయంపై టీజీ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. పవన్ కల్యాణ్ చెబితే వినడానికి తామేమైనా చిన్నపిల్లలమా అంటూ చురకలంటించారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి నిధులు కేటాయించకపోవడంపై చంద్రబాబు కూడా అసహనం వ్యక్తం చేశారన్న విషయాన్ని టీజీ ఎత్తి చూపారు.
 
భారతీయ జనతా పార్టీతో దోస్తీ వదులుకుని, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌తో కలుస్తామా లేదా? అనేది ఆయా పార్టీల అధినేతలు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని టీజీ వెంకటేశ్ వ్యాఖ్యానించారు. 
 
ఏపీ సీఎం చంద్రబాబునే బీజేపీ పట్టించుకోలేదని.. అలాంటప్పుడు తామెంత అన్నట్లుగా టీజీ కామెంట్లు చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌లో ఏపీకి నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నామని టీజీ వెంకటేశ్ కామెంట్ చేశారు.