సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 6 ఏప్రియల్ 2018 (14:21 IST)

తెలుగుదేశం ఎంపీలతో స్పీకర్ సుమిత్రా మహాజన్ తొండాట...

తెలుగుదేశం పార్టీ ఎంపీలను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ బురిడీ కొట్టించారు. వారితో తొండాట ఆడారు. దీంతో స్పీకర్ మహాజన్‌పై తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆమె కార్యాలయం ఎదుట ఆందోళనకు ద

తెలుగుదేశం పార్టీ ఎంపీలను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ బురిడీ కొట్టించారు. వారితో తొండాట ఆడారు. దీంతో స్పీకర్ మహాజన్‌పై తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆమె కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అసలు ఏం జరిగిందో ఓసారి పరిశీలిద్ధాం. 
 
శుక్రవారం పార్లమెంట్ ఉభయ సభలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. అయితే, టీడీపీ ఎంపీలు మాత్రం లోక్‌సభలో సభలో ఆందోళనకు దిగారు. ప్రధానమంత్రి కూర్చునే కుర్చీ ముందు భైఠాయించి నిరసన తెలిపారు. కొందరు ఎంపీలైతే అక్కడే పవళించారు. 
 
ఈ విషయాన్ని లోక్‌సభ సిబ్బంది స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తాను పిలుస్తున్నట్టుగా చెప్పి తీసుకునిరండి అంటూ సెక్యూరిటీ సిబ్బందికి సుమిత్రా మహాజన్ చెప్పారు. ఇదే విషయాన్ని ఎంపీలకు సెక్యూరిటీకి సిబ్బంది చెప్పడంతో ఎంపీలు సభ నుంచి బయటకు వచ్చారు. 
 
ఎంపీలు బయటకు రాగానే వెంటనే సిబ్బంది లోక్‌సభ తలుపులను మూసివేశారు. మరోవైపు టీడీపీ ఎంపీలు రాకముందే స్పీకర్‌ సుమిత్రీమహాజన్ తన కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. స్పీకర్ కార్యాలయ సిబ్బంది తీరుకు నిరసనగా లోక్‌సభ స్పీకర్‌ ఆఫీసు ఎదుట టీడీపీ ఎంపీలు నిరసనకు దిగారు. అలా టీడీపీ ఎంపీలకు లోక్‌సభ స్పీకర్ బురిడీ కొట్టించారు.