కొంత మంది పోలీసులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు!
రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోయిందో చెప్పడానికి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ ఉదంతం తాజా ఉదాహరణ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. ఎందుకు అరెస్ట్ చేసారో చెప్పలేని దుస్థితిలో ఉన్నారంటే అధికార పార్టీకి కొంత మంది పోలీసులు ఎంతగా ఊడిగం చేస్తున్నారో అర్ధమవుతుందన్నారు.
కార్యకర్త ఇంట కార్యక్రమానికి హాజరవ్వడానికి వెళ్లిన చింతమనేనిని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, గంజాయి అక్రమ రవాణా జరిగే ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరిగినందుకు అరెస్ట్ చేసామని పోలీసులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
జగన్మోహన్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపుకి పోలీసు వ్యవస్థ ఆయుధంగా మారిందని, చింతమనేని అక్రమ అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నానని, ఆయన్ని తక్షణమే విడుదల చెయ్యాలని లోకేష్ డిమాండు చేశారు.
వైకాపా కండువా కప్పుకొని అత్యుత్సాహంతో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్న కొంతమంది పోలీసులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ హెచ్చరించారు.