ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 నవంబరు 2019 (10:00 IST)

పురుగుల మందు తాగిన ఆర్టీసీ డ్రైవర్...

తెలంగాణ రాష్ట్రంలో మరో ఆర్టీసీ బసు డ్రైవర్ పురుగుల మందు తాగాడు. గత నెలన్నర రోజులకు పైగా తమ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తీవ్ర మనస్తాపం చెంది, బలవన్మరణానికి పాల్పడ్డాడు. 
 
ఆ ఆర్టీసీ డ్రైవర్ పేరు నరేశ్. మహబూబ్ నగర్ డిపోలో పని చేస్తున్నాడు. నెల రోజులకు పైగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపం చెందాడు. 
 
మరోవైపు ఉద్యోగాలు పోతాయని ప్రభుత్వం హెచ్చరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన నరేశ్ బుధవారం ఉదయం పురుగుల మందు తాగేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. 
 
అక్కడ చికిత్స పొందుతూ నరేశ్ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఇప్పటికే పలువురు ఆర్టీసీ బస్సు డ్రైవర్లు బలవన్మరణాలకు పాల్పడిన విషయం తెల్సిందే.