ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 15 నవంబరు 2021 (10:21 IST)

తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించిన తెలంగాణ గవర్నర్ తమిళ్ సై

తెలంగాణ గవ ర్నర్, పుదుచ్చేరి ఇంచార్జి  గవర్నర్  తమిళ్ సై  సోమవారం ఉదయం తిరుపతి శ్రీ గోవింద రాజుల స్వామి ఆలయంను దర్శించుకున్నారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అధికారులు ఆమెకు లాంఛ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. ఆమె ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో స్వామివారికి ద‌ర్శించుకున్నారు. అనంత‌రం ఆల‌య ప్రాంగ‌ణంలో గోమాత‌కు పూజ చేసి, గోవుల‌కు అర‌టి పండ్లు స్వ‌యంగా తినిపించారు. 
 
 
తెలంగాణ గవర్నర్ కి స్వామి వారి దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వాదం చేశారు. అనంతరం శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయం వద్ద గల ఆంజనేయ స్వామి వారిని కూడా గవర్నర్ దర్శించుకున్నారు. తిరుప‌తిలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా స‌మావేశానికి వ‌చ్చిన గ‌వ‌ర్న‌ర్, తిరుగు ప్రయాణం నిమిత్తం  రేణిగుంట ఎయిర్ పోర్ట్ కి బయలుదేరి వెళ్లారు. అక్క‌డి నుంచి ఆమె నేరుగా హైద‌రాబాదుకు చేరుకుంటారు.