బాలల విద్యకు బలమైన పునాదులు వేసిన నెహ్రూ: ఆంధ్రప్రదేశ్ గవర్నర్
బాలల విద్యకు భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ బలమైన పునాదులు వేసారని ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ కొనియాడారు. మొదటి ప్రధానమంత్రి, భారతరత్న పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకుంటున్నామని, ఈ సందర్భంగా రాష్ట్రంలోని చిన్నారులకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియ చేసారు.
పండిట్ నెహ్రూ బాలలు భారతీయ సమాజానికి వెన్నెముకగా భావించారన్నారు. పిల్లలే దేశ భవిష్యత్తు అని నమ్మిన నెహ్రూ వారిని భారత జాతి ఉన్నతికి మార్గం వేయగల పౌరులుగా తీర్చిదిద్దాలని భావించారన్నారు. నేటి బాలలే రేపటి పౌరులన్న ఆర్యోక్తి ని అనుసరించి దేశ భావి పౌరులుగా మాతృభూమిని కాపాడుతూ, భారతావనికి ఉజ్వల భవిష్యత్తును నిర్మించాల్సిన బాధ్యత వారిపై ఉందని గవర్నర్ అభిప్రాయ పడ్డారు.