వాహనాలు తగలబడిపోతున్నాయ్ : 47 డిగ్రీల ఉష్ణోగ్రత... వాతావరణ శాఖ హెచ్చరిక
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం నాటికి నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు విడుదల చేశారు. ఏపీ
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం నాటికి నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు విడుదల చేశారు. ఏపీలోని ఏలూరు, తాడేపల్లిగూడెం, విజయవాడ, గుంటూరులో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే తెలంగాణలోని కొత్తగూడెం, ఖమ్మంలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక తణుకు, రాజమండ్రి, రెంటచింతలలో 45 డిగ్రీలు నమోదుకాగా... నల్గొండ, ఆదిలాబాద్, మంచిర్యాల, ఒంగోలులో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ గరిష్ట ఉష్ణోగ్రతల కారణంగా ఎండలో పార్కింగ్ చేసిన వాహనాలు తగలబడిపోతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ ద్విచక్రవాహనం రోడ్డులోనే నిలువునా తగలబడిపోయింది.
దీనికికారణం ఒక్కసారిగా ఎండల తీవ్రత మరింత పెరిగిపోవడమేనని చెప్పారు. సాధారణం కంటే 4 నుంచి 7 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవవుతున్నాయని, ప్రజలు జాగ్రత్తలు వహించాలని సూచించారు. వాయవ్య భారత్ నుంచి వీస్తున్న వేడి గాలులు వేడిమిని మరింత పెరిగేలా చేస్తున్నాయని తెలిపారు. రాత్రిపూట కూడా వేడిగాల్పుల ప్రభావం అధికంగా ఉందని తెలిపారు.
ఇదిలావుండగా, కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో క్యూములో నింబస్ మేఘాల ప్రభావంతో వర్షం కురుస్తోంది. ఉరుములు, పిడుగులతో కూడిన జల్లులు పడటంతో ఆయా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయి. అయితే, వాయవ్యం నుంచి వీస్తున్న ఉష్ణగాలుల ప్రభావంతో గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.