మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By మోహన్
Last Updated : శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (18:15 IST)

తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన భానుడి ప్రతాపం..

తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు కారణంగా ఎండలు మండిపోతున్నాయి. దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో ఈరోజు అత్యధికంగా ఆదిలాబాద్‌లో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, హైదరాబాద్ సహా మిగతా అన్ని ప్రాంతాల్లోనూ 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు ఉన్నాయి. 
 
మరోవైపు ఏపీలోని రాయలసీమలో కూడా 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రాలో మాత్రం 35 నుంచి 40 డిగ్రీల్లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
 
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోని ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి..
 
తెలంగాణ: ఆదిలాబాద్‌ 44 భద్రాచలం 42 హకీంపేట 40 హన్మకొండ 42 హైదరాబాద్‌ 41 ఖమ్మం 41 మహబూబ్‌నగర్ 42 మెదక్‌ 42 నల్గొండ 43 నిజామాబాద్‌ 43 రామగుండం 43డిగ్రీలు 
 
ఆంధ్రప్రదేశ్: అనంతపురం 43 కడప 41 కర్నూలు 42 నంద్యాల 42 తిరుపతి 42 అమరావతి 39 విశాఖ 37 విజయవాడ 39 నెల్లూరు 39 నందిగామ 41డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.