బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 28 జూన్ 2020 (11:57 IST)

కరోనా మృతుల పట్ల ప్రభుత్వ వైఖరి అమానుషం: టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్

కరోనా మృతుల పట్ల జగన్ ప్రభుత్వ వైఖరి అమానుషంగా వుందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు.

"‌రాష్ర్టంలో కరోనా మృతులపట్ల వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అమానుషం. శ్రీకాకుళం జిల్లా పలాసలో కరోనాతో చనిపోయిన వ్యక్తిని ప్రొక్లెన్‌ తో ఈడ్చుకెళ్లిన ఘటన మానవ సంబందాలకు, సాంప్రదాయాలకు మాయనిమచ్చ. 

కరోనా రోగుల పట్ల మానవత్వం చూపాల్సిన ప్రభుత్వం అవమానీయంగా వ్యవహరించటం సిగ్గుచేటు. ఐసోలేషన్ వార్లుల్లో, క్యారంటైన్ కేంద్రాల్లో రోగులకు, డాక్టర్లకు, నర్సులకు కనీస సౌకర్యాలు కల్పించటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.

ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించిన వారిని వేదించటంపైన జగన్ పెట్టిన శ్రద్ద కరోనా నివారణపై పెట్టి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. కరోనా నివారణకు రాష్ర్ట ప్రభుత్వానికి కేంద్రం రూ.8 వేల కోట్లిచ్చిందని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్వయంగా చెప్పారు. మరి రూ.8 వేల కోట్లు నిధులు ఏమయ్యాయి?

వాటిని సక్రమంగా ప్రజల కోసం వినియోగించి వుంటే పలాసలో ఈ ఘటన జరిగి ఉందేది కాదు. ఇక ముందు పలాసలో జరిగిన ఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ వైఫల్యాలని ప్రశ్నించిన వారిని వేదించటం మాని కరోనా రోగులకు, విధులు నిర్వహిస్తున్న డాక్టర్లకు కనీసం సౌకర్యాలు కల్పించాలి" అని ప్రకటనలో డిమాండ్ చేశారు.