మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 19 ఏప్రియల్ 2020 (17:23 IST)

కర్నూలు జిల్లాలో ఐదుకు చేరిన కరోనా మృతులు

కర్నూలు జిల్లాలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రోజు రోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

కరోనాతో ఆదివారం మరొకరు మృతి చెందారు. కర్నూలు నగరంలోని మేదరి వీధికి చెందిన వృద్ధుడు(78)కి కరోనా నిర్ధారణ అయింది.

సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం వృద్ధుడు మృతి చెందినట్లు జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌ తెలిపారు.

వృద్ధుడికి ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. దీంతో జిల్లాలో మొత్తం కరోనా మృతుల సంఖ్య ఐదుకు చేరింది.