మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 ఏప్రియల్ 2020 (15:03 IST)

ఆంధ్రాలో కొత్తగా మరో 44 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 44 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 647కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర నోడల్‌ అధికారి హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. 
 
గడిచిన 24 గంటల్లో జరిగిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో కర్నూలు జిల్లాలో 26, కృష్ణా జిల్లాలో 6, తూర్పుగోదావరి జిల్లాలో 5, అనంతపురం జిల్లాలో 3, గుంటూరులో 3, విశాఖపట్నం 1 కరోనా కేసులు నమోదైనట్టుగా తెలిపారు. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 65 మంది డిశ్చార్జ్‌ కాగా, 17 మంది మరణించారని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 565 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయన్నారు. 
 
కాగా, అత్యధికంగా కర్నూలు జిల్లాలో 158 మంది కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరోవైపు రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్న 23 మందిని డిశ్చార్జ్‌ చేశారు. వీరిలో పశ్చిమ గోదావరి జిల్లాలో 9, వైఎస్సార్‌ కడప జిల్లాలో 6, చిత్తూరు జిల్లాలో 3, విశాఖపట్నం జిల్లాలో 3, తూర్ప గోదావరిలో 2 ఉన్నారు.