సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 ఏప్రియల్ 2020 (12:11 IST)

క్వారంటైన్‌లో కరోన్ బాధితుడు ఆత్మహత్యాయత్నం

తెలంగాణ రాష్ట్రంలోని ఓ క్వారంటైన్‌లోని కరోనా బాధితుడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ దృశ్యాన్ని చూసిన క్వారంటైన్ కేంద్ర సిబ్బంది ఆ బాధితుడిని ప్రాణాలతో రక్షించాడు. ఈ ఘటన తెలంగాణా రాష్ట్రంలోని అసిఫా బాద్ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కరోనా వైరస్ బాధితుల కోసం క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలోని ఓ వార్డుకు కరోనా పాజిటివ్‌ రోగిని అధికారులు తరలించారు. 
 
అయితే, ఆ వార్డులో ఉండేందుకు భయపడిన ఆ రోగి ... తనను మరో వార్డుకు మార్చాలని అధికారులను కోరారు. కానీ, అధికారులు ఇవేమీ పట్టించుకోలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆ రోగి వార్డులోనే ఉన్న చీరతో ఫ్యానుకు ఉరి వేసుకునేందుకు ప్రయత్నించాడు. దీన్ని గమనించిన వార్డులోని వైద్య సిబ్బందితో పాటు అతన్ని అడ్డుకొని మరో చోటికి తరలించారు.
 
కాగా, ఆసిఫాబాద్‌ జిల్లాలో కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. జిల్లా వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య ఐదుకి చేరింది. తాజాగా ఆరేళ్ల బాలుడికి కూడా కరోనా పాటిజివ్‌ అని తేలింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 800 దాటింది. 
 
శనివారం రాత్రి నాటికి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య  809కి చేరిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో ఇప్పటివరకు 186 మంది కోలుకుని డిశ్చార్చి అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 605గా ఉండగా, మొత్తం 18మంది మృత్యువాతపడ్డారు.