గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 18 ఏప్రియల్ 2020 (13:44 IST)

కర్నాటకలో మంకీ ఫీవర్ విజృంభణ.. 200 కేసులు నమోదు

దేశం మొత్తం కరోనా వైరస్ గుప్పెట్లో ఉంది. అయితే, కర్నాటక రాష్ట్రంలో ఒకవైపు కరోనా ఫీవర్‌తో పాటు మంకీ ఫీవర్ శరవేగంగా వ్యాపిస్తోంది. దీంతో కర్నాటక వాసులు హడలిపోతున్నారు. ఆ రాష్ట్రంలో రోజురోజుకు ఈ మంకీ ఫీవర్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. 
 
వాస్తవానికి కరోనా ఫీవర్‌తో ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సతమతమవుతోంది. మరోవైపు, కొత్తగా వచ్చిన మంకీ ఫీవర్ ప్రభుత్వాన్ని, ప్రజలను మరింత వణికిస్తోంది. ఇప్పటివరకూ ఈ వ్యాధి రాష్ట్రంలోని 12 జిల్లాలకు వ్యాపించిన‌ట్లు తెలుస్తోంది. 
 
సుమారు 200కు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ నేప‌థ్యంలో ఈ వైరస్‌పై కూడా వైద్యులు ప్రత్యేక దృష్టి పెట్టారు. అక్కడ ప్రభుత్వ యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మై నివారణ చర్యలు చేపట్టారు. నాలుగు రోజుల పాటు జ్వరం వస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని ప్రభుత్వ అధికారులు తెలిపారు.