బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By జె
Last Modified: శనివారం, 18 ఏప్రియల్ 2020 (22:02 IST)

ఆ వ్యాధులు ఉంటే కరోనా ఈజీగా సోకేస్తుంది, అందుకే న్యూయార్క్‌లో అంతమంది...

కరోనా వైరస్ సోకకుండా ఉండాలని ఎంతోమంది అనుకుంటున్నారు. ముఖ్యంగా మాస్క్‌లు, గ్లౌజ్‌లు వేసుకుని జాగ్రత్తలు పాటిస్తుంటారు. కానీ గుండె వ్యాధిగ్రస్తులు, మధుమేహం, ఊపిరితిత్తులు, రక్తనాళాలకు మధ్య వాల్వ్ లాంటి సమస్యలు ఉంటే మాత్రం కరోనా వైరస్ ఈజీగా సోకుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలా జరగకుండా ఉండాలంటే ఇలాంటి జాగ్రత్తలు తూచా తప్పకుండా తీసుకోవాలంటున్నారు.
 
కోవిడ్-19 సోకిన వ్యక్తులలో 15 శాతం మందికి ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయని, వీరు వైరస్ నుంచి కోలుకున్నాక కూడా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుందని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. గుండె వ్యాధి గ్రస్తులు, మధుమేహం లాంటివి ఉంటే మాత్రం రోగ నిరోధక శక్తి శరీరంలో తక్కువగా ఉంటుందని.. దీంతో వైరస్ సోకే ప్రభావం ఉందంటున్నారు. 
 
ఒకవేళ వైరస్ సోకితే మాత్రం తట్టుకునే సామర్థ్యం అస్సలు ఉండదంటున్నారు. కాబట్టి పొగతాగడం పూర్తిగా మానెయ్యాలని సూచిస్తున్నారు. అలాగే ఖాళీ దొరికింది కదా అని మద్యం తాగడం కూడా చేయకూడదని.. అది మరింత ప్రమాదకరమంటున్నారు. న్యూయార్క్ వంటి దేశాల్లో ఇలాంటి వ్యాధులు ఉన్న వారు ఎక్కువగా ఉండడం వల్ల అధికంగా మరణాలు చోటుచేసుకున్నాయని హృద్రోగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.