శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 26 జూన్ 2020 (12:26 IST)

రాబోయే రోజుల్లో విపరీతంగా కరోనా మరణాలు.. డబ్ల్యూ హెచ్ ఓ

రాబోయే రోజుల్లో కరోనా కనీవినీ ఎరుగని రీతిలో విరుచుకుపడబోతోంది. మృత్యువిలయం చేయబోతోంది. వచ్చే రోజుల్లో మరణాల సంఖ్య మరింత పెరగనుంది.

ఈ మేరకు రాయిటర్స్ పత్రిక ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రతినిధులను ఉటంకిస్తూ కథనం ప్రచురించింది. మరో వారంలో కరోనా కేసులు 10మిలియన్ మార్క్ ను దాటబోతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ ను అరికట్టేందుకు అన్నీ దేశాలకు డబ్ల్యూహెచ్ ఓ మద్దతు ఉంటుందన్నారు. 
 
మరోవైపు  డబ్ల్యూహెచ్ ఓ సభ్యుడు డాక్టర్ మైక్ ర్యాన్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ తీవ్రత తగ్గలేదని, రాబోయే రోజుల్లో తీవ్ర రూపం దాల్చబోతుందన్నారు.  పరిస్థితులు అదుపులోకి రాలేదని, రాబోయే రోజుల్లో కరోనా కేసులతో పాటు ..వైరస్ సోకిన బాధితులు ఎక్కువ మంది మరణించే అవకాశం ఉందని చెప్పారు. 
 
కొన్ని దేశాలు లాక్ డౌన్ నుంచి రిలాక్స్ అవుతున్నాయన్నారు. సాధారణ స్థితికి రావాలంటే మరింత సమయం పడుతుందని, అప్పటి వరకు ప్రతీ ఒక్కరు కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్ ఓ జనరల్ డైరెక్టర్  డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ సూచించారు.