బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 26 జూన్ 2020 (11:35 IST)

అచ్చెన్న కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తూ...లోకేష్ ఏం చేశాడో చూడండి!

మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శ్రీకాకుళం వెళ్లారు.
 
మార్గమధ్యలో తూర్పుగోదావరి జిల్లా మోరంపూడి జంక్షన్లో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు), ఎస్సీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కాశి నవీన్ కుమార్, నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి రెడ్డి మణి తదితర టీడీపీ నాయకులు లోకేష్ కు ఘన స్వాగతం పలికారు. 
 
ఈ సందర్భంగా లోకేష్ కొద్ది సేపు ఆగి నాయకులందరిని పలకరించి మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వ బాధితులను ఓదార్చారు. అనంతరం ఆయన శ్రీకాకుళం బయలుదేరి వెళ్లారు.