గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 13 జూన్ 2020 (17:33 IST)

అచ్చెన్న కుటుంబానికి టీడీపీ మహిళా నేతల సంఘీభావం.

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి శనివారం సంఘీభావం తెలిపారు.

శ్రీకాకుళం జిల్లా, నిమ్మడ వెళ్లి కింజరాపు అచ్చెన్నాయుడు సతీమణి విజయమాధవిని కలిసి 'మేమున్నాం' అంటూ ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను చవిచూడడానికి ఎంతో సమయం లేదని విమర్శించారు.

వైసీపీ ప్రభుత్వ అసమర్థతని అసెంబ్లీలో నిలదీస్తుండటంతో భయంతోనే  అచ్చెన్నాయుడుని ఏసీబీ కేసులో ఇరికించి అరెస్టు చేశారని ఆరోపించారు.