గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 13 జూన్ 2020 (16:54 IST)

ఏపీలో 17 మంది ఐపీఎస్ ల బదిలీ

మూకుమ్మడిగా టీడీపీ నేతల్ని అరెస్టు చేస్తున్న జగన్ ప్రభుత్వం.. ఆ సెగను తట్టుకునేందుకు ఏకంగా 17 మంది ఐపీఎస్ లను బదిలీ చేసింది.

ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారి వివరాలు..
 
1. రైల్వే డిజిగా ద్వారాక తిరులమలరావు
2. విజయవాడ సిటీ పోలీస్‌ కమిషనర్‌గా బి.శ్రీనివాసులు
3. ఎడిజిపి ఆర్గనైజేషన్‌గా ఎన్‌.బాలసుబ్రమణ్యం
4. రోడ్‌ సేష్టీ ఎడిజిపిగా కపానంద్‌ త్రిపాఠి ఉజాలా
5. ఎస్‌ఇబి డైరెక్టర్‌గా పిహెచ్‌డి.రామకృష్ణ
6. గుంటూరు అర్బన్‌ ఎస్‌పిగా ఎర్‌ఎన్‌.అమ్మిరెడ్డి
7. శ్రీకాకుళం ఎస్‌పిగా అమిత్‌ బర్దార్‌
8. డిజిపి ఆఫీస్‌ అడ్మిన్‌ ఎఐజిగా బి.ఉదరు భాస్కర్‌
9. విశాఖ శాంతిభద్రతల డిసిపిగా ఐశ్వర్య రస్తోగి
10. ఎస్‌ఐబి ఎస్‌పిగా అట్టాడా బాబూజీ
11. విశాఖ గ్రామీణ ఎస్‌పిగా బి.కృష్ణారావు
12. విజయవాడ రైల్వే ఎస్‌పిగా సిహెచ్‌.విజయరావు
13. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్‌పిగా నారాయణ నాయక్‌
14. సిఐడి ఎస్‌పిగా నవదీప్‌ సింగ్‌ గ్రేవాల్‌
15. గుంటూరు గ్రామీణ ఎస్‌పిగా విశాల్‌ గున్నీ
16. డిజిపి ఆఫీసులో రిపోర్టు చేయాల్సిందిగా ఎస్‌.రంగారెడ్డికి ఆదేశాలు
17. 'దిశ' ఘటన ప్రత్యేక అధికారిగా ఉన్న దీపికను డిజిపి కార్యాలయంలో ఎపిఎస్‌పి ఆరో బెటాలియన్‌ కమాండెంట్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.