అచ్చెన్న కేసులో అసలు వాస్తవమేంటి?
అచ్చెన్నాయుడు కేసు మొత్తం రూ.150 కోట్ల స్కాం అని హెడ్ లైన్స్ పెట్టి అచ్చెన్న బొమ్మలేస్తున్నారు. నిజానికి ఇది మొత్తం 9 పార్టులు. 8 పార్టులకి సంబంధించిన విజిలెన్స్ రిపోర్ట్ లో ఎక్కడా అచ్చెన్న పేరు రాలేదు.
అందులో ఒక్క పార్ట్ (టెలీహెల్త్ సర్వీస్) లో మాత్రమే అచ్చెన్న లేఖ ఇచ్చారని బయటకి చూపుతున్న ఆధారం. ఆ ఒక్క పార్ట్ కి సంబంధించి దానికి రూ.4-5 కోట్లైతే రూ.7.96 కోట్లు చెల్లించారనేది ఆరోపణ.
అంటే అచ్చెన్నని లింక్ చేస్తున్న స్కాం విలువ రూ.150 కోట్లు కాదు, రూ.3 కోట్లు (ఇప్పటికి బయటకు చూపిన ఆధారాల ప్రకారం)
.
ఇక ఈ రూ.3 కోట్ల కి సంబంధించి అచ్చెన్న నవంబర్ 25 2016 న ఇచ్చిన లేఖ చూడండి, అందులో 'తెలంగాణలో అమలు పరచిన విధంగా ఆంధ్రలో అమలు పరచండి' అని రాశారు. ఎందుకంటే ఇది ఆంధ్రలో కొత్త సర్వీస్ 2016 లో మోదీ మీటింగ్ పెట్టాక ఇంప్లిమెంట్ చేశారు.
అలాగే 2016 నవంబర్ 25న లేఖ ఇచ్చిన అచ్చెన్న ఆ తర్వాత కార్మికశాఖా మంత్రిగా ఉంది కేవలం 5 నెలలు మాత్రమే. 2017 ఏప్రిల్ / మే నుండి కార్మికశాఖా మంత్రిగా పితాని వచ్చారు.
అలాగే ఆ రూ.3 కోట్లకి సంబంధించి ఆ టెలీసర్వీసెస్ సంస్థకి లబ్ది చేకూరిస్తే అచ్చెన్న లబ్దిపొందినట్లు ఏమీ ఆధారాలు (క్యాష్ , షేర్స్) బయటకైతే చూపలేదు మరి.
ఈ స్కాంలో ప్రస్తుతానికి బయటకి చూపుతున్న ఆధారాల ప్రకారం అచ్చెన్న పాత్ర రూ.3 కోట్ల అవకతవకలకి సంబంధించి.
అది కూడా పక్క రాష్ట్రాల లాగా అమలు చెయ్యండని లేఖ మాత్రమే ఇచ్చి, అందునా ఆ తర్వాత 5 నెలల్లో పదవి నుండి దిగిపోయిన, అందునా ఎప్పుడు పిలిచినా విచారణకు సహకరిస్తానన్న ప్రజాప్రతినిధి.
అందులోనూ ఒక్కరోజు ముందే సర్జరీ అయిన అచ్చెన్నని గోడలు దూకి టాబ్లెట్స్ కూడా తీసుకోనివ్వకుండా పొద్దున నుండి రాత్రిదాకా తిప్పుతూ చిత్రహింసలకు గురి చెయ్యడాన్నిఏవిధంగా అర్థం చేసుకోవాలని టీడీపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.