1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (19:58 IST)

సోషల్ మీడియా ప్రచారం అవాస్తవం: టీటీడీ

తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 30వ తేదీ దాకా భక్తులకు దర్శనం నిలిపి వేయాలని  నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ ఖండించింది.

ఈ మేరకు  టీటీడీ ప్రజాసంబంధాల అధికారి మంగళవారం ప్రకటన విడుదల చేశారు. "రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ ధర్మ కర్తల మండలితో చర్చించి తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 30వ తేదీ దాకా భక్తులకు దర్శనం నిలిపి వేయాలని  సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం.

భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించే విషయం పై ధర్మకర్తల మండలి  తగు నిర్ణయం తీసుకుంటుంది. ఇలాంటి అవాస్తవ ప్రచారం చేస్తున్న వారి మీద టీటీడీ యాజమాన్యం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుంది" అని ఆ ప్రకటనలో తెలిపారు.