సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: సోమవారం, 4 జనవరి 2021 (22:06 IST)

పేదలను జగనన్న దత్తత తీసుకున్నారు: చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి

ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి గృహ యోగం కల్పించే బృహత్తర యజ్ఞానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం చిన్నగొట్టిగల్లు మండలం దేవరకొండ లో 'నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు ' కార్యక్రమంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి, ఎమ్మెల్సీ యండవల్లి శ్రీనివాసుల రెడ్డి పాల్గొన్నారు.
 
ఎమ్మెల్యే చెవిరెడ్డి సతీసమేతంగా లబ్ధిదారులైన అక్కాచెల్లెమ్మలకు ఇంటి పట్టాతో పాటు లెనిన్ చీర, లెనిన్ జాకెట్‌తో పాటు శ్రీవారి లడ్డూ, శ్రీ పద్మావతి అమ్మవారి కుంకుమ, పసుపు, గాజులు, పూలు, పండ్లు, ఆకు, వక్కతో కూడిన సారెను అందించారు. ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు.
 
ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పేదలను సీఎం జగన్ దత్తత తీసుకున్నారని అన్నారు. వారికి ఏ కష్టం రాకుండా చూసుకునేందుకు నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు భగీరథ ప్రయత్నం చేశారన్నారు. తండ్రి ఆస్తికి, అంతస్తులకు, అధికారాలకు వారసులుగా నిలిచే తనయులను చూ శాము. కానీ, తండ్రి ఆశయానికి, లక్ష్యానికి వారసుడుగా సీఎం జగన్ అన్న నిలిచి నేడు రాష్ట్ర పాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు.
 
పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేశారని అన్నారు. ఒక నాయకుడు మంచివాడైతే రాష్ట్రంలో పాలన ఎలా ఉంటుందో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చూపారాన్నారు. అసమర్థ నాయకుడు పాలనను గత పాలకులు చూపారని ఎద్దేవా చేశారు. తండ్రి ఆశయాలను పుణికిపుచ్చుకుని ప్రజాకర్షక పాలనకు సీఎం జగనన్న పాలన ఆదర్శమన్నారు.
 
ప్రజలు అధికారం కట్టబెట్టినా నేటికీ వ్యవస్థలను అడ్డుపెట్టుకొని కొందరు సీఎం జగనన్నను ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పోరాట యోధుడిలా ఇబ్బందులను అధిగమిస్తూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇస్తుండటం పట్ల సీఎం జగనన్న భగీరథ ప్రయత్నంగా అభివర్ణించారు. 
 
అంతకుముందు ఎమ్మెల్సీ యండవళ్లి శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే చెవిరెడ్డి సమర్థవంతమైన నాయకుడని కొనియాడారు. నిరుపేదలకు ఇళ్ళ పట్టాల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అభిప్రాయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. నా సొంత మండలం నుంచి ఇళ్ళ పట్టాల పంపిణీ కి స్వాగతించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి మంచి కార్యక్రమానికి మనమందరం అండగా నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వంలో రాష్ట్రం, రైతాంగం అభివృద్ది చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.