సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 23 డిశెంబరు 2021 (22:15 IST)

శ్రీలంక ప్రధానికి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలతో ఘనస్వాగతం

శ్రీలంక ప్రధాని మహింద రాజ పక్సేకు రేణిగుంట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. తిరుమల శ్రీవారి దర్సనార్థం కొలంబో విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో గురువారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు శ్రీలంక ప్రధాని.

 
డెమోక్రటిక్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక పిఎంగా మహీందర్ రాజపక్సేను పిలుస్తున్నారు. ఆయనకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, సంగీత నృత్యాలతో ఘనస్వాగతం లభించింది. 

 
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ్, ఎస్పీ వెంకట అప్పలనాయుడులతో పాటు పలువురు అధికారులు, అనధికారులు శ్రీలంక ప్రధానికి ఘనస్వాగతం పలికారు. 

 
అనంతరం రోడ్డుమార్గం ద్వారా తిరుమలకు బయలుదేరారు శ్రీలంక ప్రధాని. తిరుమల పద్మావతి అతిథి గృహం చేరుకున్న శ్రీలంక ప్రధానికి టిటిడి అదనపు ఈఓ ధర్మారెడ్డిలు ఘనస్వాగతం పలికారు. రేపు ఉదయం విఐపి విరామ దర్సనా సమయంలో శ్రీవారిని దర్సించుకోనున్నారు శ్రీలంక ప్రధాని.