ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 31 జులై 2019 (23:04 IST)

ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం... మంత్రి మోపిదేవి వెంకటరమణ

సుదీర్ఘమైన చర్చలు ద్వారా బిల్లుల ప్రాధాన్యత ప్రజలకు తెలిసేలా శాసన సభ, మండలి సభ్యులతో ఆమోదించడం జరిగిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. సంపూర్ణంగా బిల్లులపై సమగ్రంగా చర్చించి ఆమోదించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం అన్నారు. 
 
బుధవారం ఉదయం వెలగపూడి 4వ బ్లాక్  పబ్లిసిటీ సెల్ లో మీడియా తో మాట్లాడుతూ, అధికారంలోకి వొచ్చిన తర్వాతఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు, చర్యలు ప్రతిబింబిస్తున్నాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర లో ప్రజలకు ఇచ్చిన హామీలకు చట్టబద్ధత తీసుకుని రావడం కోసం  బిల్లులను శాసనసభ, శాసన మండలిలలో  ప్రవేశ పెట్టి ఆమోదించడం జరిగిందని రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు.

ఇచ్చిన హామీలలో ఒకటో రెండో అమలుచేసి దాఖలాలు ఉండేవన్నారు. ఇచ్చిన హామీల ప్రతిఫలాలు ప్రభుత్వ పధకాలను ప్రజలకు అందించాలనే దృఢ సంకల్పం తో బిల్లుల ద్వారా వాటికి చట్టబద్ధత కల్పించడం జరిగిందన్నారు. ఎస్సి, ఎస్టి, బిసి, తదితర సామాజిక వర్గాలకు 50 శాతం మేర నామినేటెడ్ పదవులు, పనుల్లో వీలు కల్పిస్తు బిల్లులను ఆమోదించడం జరిగింది.

అధికార పార్టీవారికి, కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రభుత్వ పధకాలను సామాన్యులకు కూడా ఖచ్చితంగా అందించాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేశారన్నారు.  ప్రభుత్వం ఆధ్వర్యంలో చేప్పట్టే  అన్ని కార్యక్రమాల్లో మహిళలకు కూడా 50 శాతం భాగస్వామ్యం ఉండాలని ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  తీసుకున్న నిర్ణయం పట్ల అన్నివర్గాల వారు స్వాగతిస్తున్నారన్నారు. 
 
స్థానికంగా ఏర్పాటు చేసే పరిశ్రమలలో 75 శాతం స్థానికులకే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే బిల్లును సైతం ఆమోదించడం ద్వారా చట్టబద్ధత తీసుకుని రావడం జరిగిందన్నారు. గ్రామ, వార్డు సచివాలయలు, వాలేంటర్లు ద్వారా రాష్ట్రంలో 3 లక్షల75 వేల మంది యువత కు ఉద్యోగాలు కల్పించి, వారికి వారిపై నమ్మకాన్ని కల్పించగలిగామన్నారు.  యువత పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారన్నారు.

రైతాంగంలో రైతులు ఎన్ని విధాలుగా నష్ట పోతున్నారో ఆలోచన చేసి ధరల స్థిరీకరణ, ప్రకృతి విపత్తుల నిధిని ఏర్పాటు చెయ్యడం జరిగింది. రాష్ట్రంలో ఎక్కువగా కౌలు రైతులు ఉన్నారని, ప్రధానంగా ఈ రాష్ట్రం రైతు ఆధారిత ప్రాంతమన్నారు. రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం అడుగులు వెయ్యడం జరిగింది. ప్రభుత్వం నుంచి వొచ్చే లబ్ది రైతులకు అందించాలనే ఉద్దేశ్యం తో కౌలు దారి చట్టం ద్వారా వారికి భద్రత కల్పించాలని చట్టం తీసుకుని రావడం జరిగిందన్నారు. 
 
విద్యా విధానం పై శాసనసభలో, శాసన మండలి లో మంచి చర్చ జరిగిందని మంత్రి పేర్కొన్నారు. కొద్దిమంది వ్యక్తుల చేతుల్లో విద్య వవస్థ ఉండడం వల్ల ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసి తల్లితండ్రుల ఆలోచనలు కు అనుగుణంగా ఫీజుల నియంత్రణ కోసం చట్టబద్ధత తీసుకుని రావడం జరిగిందన్నారు.

మద్య నియంత్రణ బిల్లు ద్వారా దశల వారిగా మద్య నియంత్రణ కీ చర్యలు ద్వారా దశల వారిగా మద్యాన్ని రద్దు చేసే ఆలోచన స్వాగతించ తగ్గ పరిణామం అన్నారు. శాసన సభ్యులు లను మార్కెట్ కమిటీ ల గౌరవ అధ్యక్షులు గా నియమిస్తామని, ఆయా ఛైర్మన్ ల నియామకంలో సామాజిక న్యాయం పాటిస్తూ  చట్టానికి లోబడి ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు  అనుగుణంగా నే అన్ని పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలుకు కట్టుబడి ఉన్నామన్నారు. 

సుదీర్ఘమైన చర్చలు ద్వారా బిల్లుల ప్రాధాన్యత ప్రజలకు తెలిసేలా శాసన సభ,  మండలి సభ్యులతో ఆమోదించడం జరిగిందన్నారు. సంపూర్ణంగా బిల్లులపై సమగ్రంగా చర్చించి ఆమోదించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం అన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలకు చట్టబద్ధత కు నిదర్శనం గా బిల్లుల ఆమోదం నిలుస్తోంది. ప్రభుత్వం చర్యలు పట్ల అన్ని వర్గాలు హర్షాతిరేకాలు ప్రకటిస్తున్నాయన్నారు.