బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 2 మే 2020 (15:02 IST)

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నూతనంగా ప్రమాణస్వీకారం చేసిన ముగ్గురు న్యాయమూర్తులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో నూతన న్యాయమూర్తులుగా జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్, జస్టిస్ కంచిరెడ్డి సురేష్ రెడ్డి, జస్టిస్ కన్నెగంటి లలిత కుమారి అలియాస్ లలిత ప్రమాణస్వీకారం చేశారు.

ఈ మేరకు హైకోర్టులోని ఒకటవ నెంబర్ హాల్ లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (చీఫ్ జస్టిస్) జితేంద్ర కుమార్ మహేశ్వరి నూతనంగా నియమితులైన న్యాయమూర్తులచే శనివారం ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయించారు.

తొలుత హైకోర్టు  ఇన్ చార్జ్ రిజిస్ట్రార్‌ జనరల్‌ బి. రాజశేఖర్  న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను చదివి వినిపించారు.

నూతన న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్, జస్టిస్ కంచిరెడ్డి సురేష్ రెడ్డి, జస్టిస్ కన్నెగంటి లలిత కుమారి అలియాస్ లలిత దస్త్రాలపై సంతకాలు చేశారు. 
 
కార్యక్రమంలో హైకోర్టు సీనియర్ అడ్వకేట్లు, జడ్జిలు, ప్రమాణస్వీకారం చేసిన న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.