బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 మే 2020 (09:08 IST)

తిరుమల ఘాట్ రోడ్లపై దేవాంగ పిల్లులు!!

కరోనా వైరస్ ప్రజలకు హాని చేస్తే ప్రకృతితో పాటు.. వన్య ప్రాణులకు మాత్రం ఎంతో మేలు చేసిందని చెప్పొచ్చు. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు దేశం మొత్తం లాక్డౌన్‍లో ఉంది. దీంతో వాహనరాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. ఫలితంగా అడవుల్లో సంచరించే అనేక క్రూర మృగాలతో పాటు.. వన్యప్రాణులు సైతం స్వేచ్ఛగా రోడ్లపై విహరిస్తున్నాయి. 
 
ఇలాంటి దృశ్యాలను తిరుమల ఘాట్ రోడ్లపై చూశాం. ఇపుడు తాజాగా మరో అరుదైన దృశ్యం కనిపించింది. తిరుమల రెండో ఘాట్ రోడ్డు చివరి మలుపు సమీపంలో రెండు అరుదైన పిల్లలు కనిపించాయి. వీటిని దేవాంగ పిల్లులుగా అధికారులు గుర్తించారు. ఇవి కేవలం అటవీ ప్రాంతంలోనే కనిపిస్తుంటాయి. 
 
ఈ ఘాట్ రోడ్డులో నిర్మాణ పనులు చేస్తున్న రోడ్డు నిర్మాణ కార్మికులు ఈ పిల్లులను గుర్తించి, తితిదే అధికారులకు సమాచారం చేరవేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు వాటిని అక్కడే ఉంచారు. అరుదైన జాతికి చెందిన ఈ దేవాంగ పిల్లులు శేషాచలం అటవీప్రాంతంలో నివసిస్తున్నట్టు అధికారులు తెలిపారు.