డోంట్ కేర్ : శ్రీవారి ఆస్తుల విక్రయానికే తితిదే మొగ్గు!
తమిళనాడులోని తిరుమల శ్రీవారి ఆస్తులను విక్రయించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, తితిదే నిర్ణయించింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలు హిందూ ధార్మిక సంస్థలు ఉద్యమానికి కూడా వెనుకాడబోమని హెచ్చరికలు చేస్తున్నాయి. అయితే, ఏపీ సర్కారు, తితిదే మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా విక్రయానికే మొగ్గు చూపాలని భావిస్తోంది.
తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాల్లో తితిదేకు ఆస్తులు ఉన్నాయి. అయితే, తమిళనాడులో ఉన్న నిరర్ధక ఆస్తులను విక్రయించాలని తితిదే నిర్ణయించింది. విపక్షాల నుంచి ఎన్ని విమర్శలు ఎదురైనా శ్రీవారి ఆస్తుల విక్రయానికే తితిదే మొగ్గు చూపుతోంది. దాతలు ఇచ్చిన భూములను కాపాడాలన్న డిమాండ్ వస్తున్నా... తితిదే గతంలో తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది.
తమిళనాడులో 23 ఆస్తులే గాక.. భవిష్యత్తుల్లో మరిన్ని ఆస్తులను అమ్మేందుకు జాబితాను సిద్ధం చేస్తోంది. ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నా, విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నా.. నిరర్థక ఆస్తుల పేరుతో తిరుమల శ్రీవారి ఆస్తుల విక్రయానికే తితిదే మొగ్గు చూపుతోంది.
దాతలు ఇచ్చిన భూములు కాపాడాలని, వాటిని విక్రయించవద్దని డిమాండ్ వస్తున్నా.. తితిదే గతంలో తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది. పైగా తమిళనాడులో వేలానికి సిద్ధం చేసిన 23 ఆస్తులతో పాటు.. భవిష్యత్తులో మరిన్ని ఆస్తులను అమ్మేందుకు జాబితాను సిద్ధం చేస్తోంది.
తితిదే శనివారం విడుదల చేసిన ప్రకటన మేరకు ఇప్పటి వరకు విక్రయించడానికి గుర్తించిన ఆస్తుల విలువ రూ.23.92 కోట్లుగా లెక్కగట్టారు. వాస్తవానికి తితిదే బడ్జెట్‌లో నిరర్థక ఆస్తుల విక్రయం ద్వారా రూ.100 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని పొందుపర్చింది.