తిరుపతి-అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం
ఏపీలోని తిరుపతి-అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. అనంతపురం జిల్లా ధర్మవరం పరిధిలోని కదిరి గేట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
శుక్రవారం రాత్రి ట్రైన్ వెళ్తున్న మార్గంలో కొంత మంది గుర్తు తెలియని దుండగులు పట్టాలపై రాళ్లు పెట్టారు. అయితే.. పట్టాలపై ఉంచిన రాళ్ల పైనుంచి ట్రైన్ వెళ్లడంతో ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
దీంతో అప్రమత్తమైన పైలెట్లు వెంటనే రైలును నిలిపివేసి అధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా.. ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో కదిరిగేటు వద్ద అమరావతి ఎక్స్‌ప్రెస్ గంటపాటు నిలిచిపోయింది.
ఆ తర్వాత వెంటనే రంగంలోకి దిగిన రైల్వే సిబ్బంది ట్రైన్‌కు మరో ఇంజిన్‌ను జోడించారు. దీంతో రైలు బయలుదేర్దింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరక్కపోవడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.