శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (11:56 IST)

తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలు ప్రారంభం

వైఎస్సార్‌ ‘తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ సేవల్లో భాగంగా అత్యాధునిక కూడిన 500 ఏసీ వాహనాలను ఏపీ సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ప్రసవం అనంతరం తిరిగి వారిని ఇళ్లకు తీసుకెళ్లేందుకు ఈ వాహనాలను వినియోగించనున్నారు. వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా ద్వారా విశ్రాంతి సమయంలో తల్లి అవసరాల కోసం రూ. 5 వేలను సాయంగా అందించనున్నారు. 
 
ఏడాదికి సగటున నాలుగు లక్షల మందికి ఇది అందుబాటులోకి రానున్నట్లు ప్రభుత్వ అధికారులు అంచనా వేస్తున్నారు. తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సేవల కోసం టోల్‌ఫ్రీ నెంబర్‌ 102ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందుకోసం 500 వాహనాలను అందుబాటులోకి తెస్తున్నారు.