సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 సెప్టెంబరు 2024 (17:45 IST)

తిరుమల లడ్డూ వివాదం- కాలినడకన తిరుమలకు వైకాపా చీఫ్ జగన్

jagan
తిరుమల లడ్డూ వివాదం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ వ్యాప్తంగా ఈ నెల 28వ తేదీన ఆలయాల్లో పూజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు వైసీపీ శ్రేణులు పూజలు చేయాలన్నారు. 
 
లడ్డూ వివాదం నేపథ్యంలో తిరుమలకు వెళ్లాలని కూడా జగన్ నిర్ణయించుకున్నారు. ఈ నెల 28న ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు. కాలి నడకన తిరుమలకు చేరుకుని పూజలు నిర్వహించనున్నారు. అదే రోజున పార్టీ నేతలు ఆలయాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొనాలన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు పూజలు చేయాలని జగన్ అన్నారు.