నేడు శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణం నిర్వహించనున్నారు. కోవిడ్ -19 నేపథ్యంలో మార్చి 2 నుండి 10వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలను ఆలయంలో ఏకాంతంగానిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం 6.00 నుండి రాత్రి 7.00 గంటల వరకు పుణ్యాహవాచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవము, శాస్త్రోక్తంగా అంకురార్పణం జరుగనుంది.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ ఉదయం రాత్రి
02-03-2021(మంగళవారం) ధ్వజారోహణం(మీనలగ్నం) పెద్దశేష వాహనం
03-03-2021(బుధవారం) చిన్నశేష వాహనం హంస వాహనం
04-03-2021(గురువారం) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
05-03-2021(శుక్రవారం) కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
06-03-2021(శనివారం) పల్లకి ఉత్సవం(మోహినీ అవతారం) గరుడ వాహనం
07-03-2021(ఆదివారం) హనుమంత వాహనం తిరుచ్చి, గజ వాహనం
08-03-2021(సోమవారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
09-03-2021(మంగళ వారం) సర్వభూపాల వాహనం అశ్వవాహనం
10-03-2021(బుధవారం) చక్రస్నానం ధ్వజావరోహణం
ఈ సందర్భంగా ప్రతి రోజు ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 8 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు ఆలయంలో ఏకాంతంగా వాహన సేవలు నిర్వహిస్తారు. గరుడసేవ మాత్రం రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు నిర్వహిస్తారు.