మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 12 డిశెంబరు 2020 (07:27 IST)

శ్రీనివాస మంగాపురంలో ఎర్రచందనం దుంగలు స్వాధీనం

తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం వద్ద 49 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఎస్పీ ఆంజనేయులు తెలిపారు.  ఆర్ ఎస్ ఐ వాసు, డీఆర్వో నరసింహ రావు టీమ్ భాకరాపేట అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారని తెలిపారు.

రాత్రి కొంతమంది ఎర్రచందనం దుంగలను మోసుకుంటూ శ్రీనివాస మంగాపురం వద్ద దుంగలతో రోడ్డు దాటుతూ కనిపించారు. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని అడ్డుకున్నారు.  స్మగ్లర్లు దుంగలను పడేసి దట్టమైన మంచు, పొదల్లో కలసి పోయినట్లు తెలిపారు. పొదల మధ్య వారికోసం తమ సిబ్బంది గాలిస్తున్నట్లు చెప్పారు.

సంఘటన స్థలానికి డీఎస్పీ లు వెంకటయ్య, గిరిధర్, సిఐలు చంద్రశేఖర్, వెంకటరవి ఎఫ్ ఆర్వో లు ప్రసాద్, నటరాజ తదితరులు చేరుకుని పరిస్థితి సమీక్షించారు. టాస్క్ పోలీసు స్టేషన్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.