శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 12 డిశెంబరు 2020 (07:18 IST)

రథం లాగిన రోజా

నగరి శాసనసభ్యురాలు ఆర్.కే.రోజా నగరి కరకంఠేశ్వరస్వామి వారికి 15 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన రథంను ఆవిష్కరించారు.

అనంతరం మాడావీధుల్లో శ్రీ  కామాక్షి సమేత కరకంఠేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన రథోత్సవాన్ని ప్రారంభించి, ఆదిదంపతుల విశేష సేవలో ఎమ్మెల్యే  పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో  మొదలియార్ కార్పోరేషన్ డైరెక్టర్ బాలకృష్ణన్ , కన్వీనర్ బి.ఆర్వి.అయ్యప్ప . మాజీ కౌన్సిలర్ నీలమేఘం, బాలన్  దేశమ్మ ఆలయకమిటీ చైర్మన్ బాబురెడ్డి, నాయకులు  నియోజక వర్గ బూత్ కమిటీ కన్వీనర్ చంద్రారెడ్డి, మురుగన్, మునికృష్ణా రెడ్డి, కన్నాయరం, కృష్ణమూర్తి, మున్సిపల్ కమీషనర్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.