ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 28 అక్టోబరు 2020 (08:59 IST)

కడప జిల్లాలో 20 ఎర్రచందనం దుంగల స్వాధీనం

కడప జిల్లా రైల్వేకోడూరు బాలుపల్లె రేంజ్‌ అటవీ శాఖ పరిధిలో 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఇద్దరు తమిళ స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు బాలుపల్లె ఎఫ్‌ఆర్‌ఓ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.

ముందస్తు సమాచారం మేరకు బాలుపల్లె వెస్ట్‌ బీటులోని పందికుంట ప్రదేశంలో దాడులు జరిపి ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి 20 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకుని తమిళనాడుకు చెందిన చిన్న పెరుమాల్‌, అరుణాచలం అనే ఇరువురిని అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరచామని తెలిపారు.

పట్టుబడ్డ ఎర్రచందనం బరువు 648 కేజీలు కాగా ప్రభుత్వ ధర ప్రకారం వాటి విలువ రూ.1.55 లక్షలు ఉంటుందన్నారు. ఈ దాడుల్లో బల్లిపల్లె రేంజ్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ ఎం.బాల చంద్రుడు, బీట్‌ ఆఫీసర్లు ఎం.సుధాకర్‌, కెవి.సుబ్బయ్య, ఆర్‌.సుబ్బలక్ష్మమ్మ, బేస్‌ క్యాంప్‌ వాచర్లు, స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ ప్రొటెక్షన్‌ వాచర్లు పాల్గొన్నారని తెలిపారు.