ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 28 అక్టోబరు 2020 (08:37 IST)

ప్రభుత్వం క్రీడాకారులకు మంచి గుర్తింపునిస్తుంది: ఉపముఖ్యమంత్రి అంజాద్ భాష

క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి. అంజాద్ భాష  పేర్కొన్నారు. ఐపీఎల్ క్రీడాకారుడు విజయ్ జన్మదినం సందర్భంగా కడపలోని ఏసిఎకెఎస్ఆర్ఎం గ్రౌండ్ నందు విజయ్ ప్రీమియర్ లీగ్ - 2020 జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగింపు సమావేశం నిర్వహించారు.
 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి  మాట్లాడుతూ.. ఐపీఎల్ క్రీడాకారుడు విజయ్ క్రికెట్ రంజీ ట్రోఫీలో 260 వికెట్లు తీసి ఆంధ్రప్రదేశ్ కు మంచి గుర్తింపు తీసుకు రావడం జరిగిందన్నారు. ఐపీఎల్ లో డక్కన్ చార్జెర్స్ హైదరాబాద్ టీములకు 2008 నుంచి 2011 వరకు క్రికెట్ ఆడడం జరిగిందన్నారు.

అనంతరం 2019 డిసెంబర్ రంజీ క్రికెట్ కు విజయ్ రిటైర్మెంట్ ఇవ్వడం జరిగిందన్నారు. రాబోయే రోజులలో ఇలాంటి మంచి  క్రికెట్ పోటీలు నిర్వహించి మన జిల్లా వాసులు తమలోని ప్రతిభను వెలికి తీసి రాష్ట్రస్థాయి జాతీయస్థాయి క్రికెట్ క్రీడాకారులుగా ఎదగాలన్నారు.

యువత ఒక చదువుకే కాకుండా క్రీడలలో కూడా రాణించాలన్నారు. క్రీడాకారులకు ప్రభుత్వం మంచి గుర్తింపు ఇస్తూ ఉద్యోగ అవకాశాలలో ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
 
మాజీ మేయర్ సురేష్ బాబు మాట్లాడుతూ.. ఐపీఎల్ క్రీడాకారుడు విజయ్ జన్మదినం సందర్భంగా క్రీడాకారులను ప్రోత్సహించడానికి కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్ మరియు కడప నైట్రైడర్స్ ఆధ్వర్యంలో విజయ్ ప్రీమియర్ లీగ్ -2020 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం ఎంతో సంతోషించదగ్గ విషయమన్నారు.

గత రెండు రోజుల నుంచి జరుగుతున్న ఈ క్రికెట్ పోటీలలో 27వ తేదీ ఫైనల్ మ్యాచ్ నందు కేకేఆర్ మరియు సూపర్ కేకేఆర్, జట్లు తలపడగా కేకేఆర్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించి విజయ్ ప్రీమియర్ లీగ్ 2020 కప్పు ను కైవసం చేసుకున్నారు. ఇందులో షకీల్ 72 రన్స్ సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా  నిలిచారు.

ఈ మ్యాచ్లో విన్నర్స్ కు మరియు  రన్నర్స్ కు ఉప ముఖ్యమంత్రి వర్యులు ఎస్ బి. అంజాద్బాష, మాజీ మేయర్ సురేష్ బాబు చేతుల మీదుగా అచీవర్స్ కప్పు, మెడల్స్ మరియు సర్టిఫికెట్లు అందజేశారు.
 
ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు తారిక్ అలీ, జమీల్, రాకింగ్ తన్వీర్, డాక్టర్ సోహైల్ అహ్మద్, డాక్టర్ ఆబిద్, మన్సూర్ అలీ ఖాన్, జన వికాస్ సేవా సమితి అధ్యక్షులు తాహిర్, వైయస్సార్ సిపి నాయకులు దాసరి శివప్రసాద్, 30వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి షఫీ, నగర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.