శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 8 డిశెంబరు 2020 (17:09 IST)

డిసెంబ‌రు 11న శ్రీ‌నివాస‌మంగాపురంలో కార్తీక వ‌న‌భోజ‌నం

టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబ‌రు 11న శుక్ర‌వారం కార్తీక వనభోజన కార్యక్రమం జరుగనుంది.

కోవిడ్‌-19 నిబంధ‌న‌ల నేప‌థ్యంలో ఈ ఉత్స‌వాన్ని ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తారు. ఈ ఉత్స‌వం కార‌ణంగా కల్యాణోత్సవం ఆర్జిత సేవ ర‌ద్ద‌యింది. పవిత్రమైన కార్తీక మాసంలో ద్వాద‌శి నాడు ఇక్క‌డ వనభోజన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 
 
ఇందులో భాగంగా శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులను ఆల‌యంలోని క‌ల్యాణ మండ‌పానికి వేంచేపు చేస్తారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. ఆ తరువాత అలంకారం, వ‌న‌భోజ‌నం, అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మం నిర్వహిస్తారు.