గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 డిశెంబరు 2020 (12:34 IST)

విశాఖపట్నంలో దారుణం: గర్భవతి అని చూడకుండా కాలితో తన్నాడు..

విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకుంది. గర్భవతి అయిన కోడల్ని రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి ఉదయ భాస్కర్ కాలితో తన్నిన ఘటన సంచలనంగా మారింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిన విశాఖ కేజీహెచ్ చికిత్స కోసం చేరింది. 
 
2018లో ఉదయభాస్కర్ కుమారుడు వేణుగోపాల్‌తో ఆమెకు వివాహం అయింది. భర్త, మామ ఆడపడుచు వేధిస్తుండడంతో గతంలోనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది బాధితురాలు. 
 
పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి వెనక్కి పంపారు. కరోనా సమయంలో శిరీషను భర్త పుట్టింటికి పంపించేశారు. ఎన్నాళ్ళు అయినా మళ్ళీ తిరిగి తీసుకు వెళ్ళడం అత్తవారింటికి వెళ్ళిన శిరీషను మామ కాళ్లతో తన్నినట్టు సమాచారం.