గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 నవంబరు 2020 (21:02 IST)

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా.. 24 గంటల్లో 625మందికి కోవిడ్.. ఐదుగురు మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 49,348 కరోనా టెస్టులు నిర్వహించగా 625 మందికి కరోనా నిర్ధారణ అయింది. 1,186 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అదే సమయంలో 5 మరణాలు సంభవించాయి. కృష్ణా జిల్లాలో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, విశాఖపట్నంలో ఒక్కరు కరోనాతో మృతి చెందారు. అటు, మొత్తం మరణాల సంఖ్య 6,981కి పెరిగింది.
 
కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకు 8,67,063 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8,48,511 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 11,571 మంది చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో కరోనాతో కృష్ణాలో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఇద్దరు, విశాఖపట్నంలో ఒక్కరు.. మొత్తం ఐదుగురు మరణించారు.