ఏపీ సముద్రతీరంలో టోర్నడో.. అద్భుతమైన దృశ్యం.. నెట్టింట చక్కర్లు
తూర్పు గోదావరి జిల్లాలో కనిపించిన ఓ టోర్నడో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సముద్రం నుంచి నీరు ఆకాశంలోకి వెళుతున్నట్టు కనిపించిన ఈ టోర్నడోను కొందరు మత్స్యకారులు తమ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు.
అదే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఐ పోలవరం మండలం భైరవపాలెం దగ్గర సముద్రంలో ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. అప్పుడప్పుడూ గాలి దుమారంతో లేచే టోర్నడోలు చూసుంటాం.. కానీ ఇది విచిత్రంగా ఉందని స్థానికులు అంటున్నారు.
నెటిజన్లు అద్భుతంగా ఉందంటూ వీడియోను షేర్ చేస్తున్నారు. ఇందులో ఆకాశం తొండంతో సముద్రపు నీటిని లాగేస్తుందని స్థానికులు అంటున్నారు.